: మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహం తొలగింపు... నిరసనకు దిగిన అఖిలపక్షం
మహబూబ్‌నగర్ జిల్లా ఐజలో తెలంగాణ తల్లి విగ్రహం తొలగింపు వివాదాస్పదం అయింది. ప్రజల సెంటిమెంట్ తో ముడిపడివున్న విగ్రహాన్ని ప్రభుత్వ అధికారులే దగ్గరుండి తొలగించినట్టు తెలుస్తోంది. అయితే విగ్రహ తొలగింపునకు కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. ఈ ఘటనను నిరసిస్తూ, కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం, బీజేపీ, వామపక్ష తదితర పార్టీల అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించిన నగర పంచాయతీ కమిషనర్ ను తక్షణం సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.