: కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఐఏఎస్ లకు అవమానం... ఐడీ కార్డులు చూపాలన్న సెక్యూరిటీ సిబ్బంది


తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద నేటి ఉదయం ఐఏఎస్ అధికారులకు అవమానం జరిగింది. మీరెవరైతే మాకేంటీ, ఐడీ కార్డులు చూపిస్తేనే లోపలికి అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో ఐఏఎస్ లు కంగుతిన్నారు. తాము ఐఏఎస్ అధికారులమని చెప్పినా సెక్యూరిటీ సిబ్బంది వినలేదు. వివరాల్లోకెళితే, తొమ్మిది నెలల తన పాలనపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరుకావాలని సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేటి ఉదయం సీఎం సమీక్షా సమావేశానికి వచ్చిన అధికారులను సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్దే నిలిపేశారు. సమాచారం అందుకున్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అక్కడికొచ్చి సెక్యూరిటీ సిబ్బందిని వారించి, ఐఏఎస్ లను లోపలికి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News