: ప్రజలపై భారం మోపడమే నాయకత్వమా?: షర్మిల
రాష్ట్ర ప్రభుత్వం సర్ ఛార్జీల పేరుతో విద్యుత్ బిల్లులను మూడింతలు చేసి, ప్రజలపై భారం మోపుతోందని కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల విమర్శించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎటువంటి ఛార్జీలు, పన్నులు పెంచకుండా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారని షర్మిల అన్నారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా ఆమె ఇవాళ నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని తిరుగండ్లపల్లి గ్రామంలో పర్యటించారు.