: స్వైన్ ఫ్లూతో జోద్ పూర్ లో మృతి చెందిన స్వీడన్ వాసి!
స్వీడన్ నుంచి భారత పర్యటనకు వచ్చిన 70 సంవత్సరాల అన్ మేరీ స్వైన్ ఫ్లూ లక్షణాలతో చికిత్స పొందుతూ మృతి చెందారు. జైసల్మేర్ పర్యటనకు వచ్చిన ఆమె తీవ్ర జ్వరం, జలుబు తదితరాలతో జోద్ పూర్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో, వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తుండగా చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆమె రక్త పరీక్ష నివేదిక రావలసి ఉందని వివరించారు. కాగా, ఆమెకు స్వైన్ ఫ్లూ సోకి ఉంటే, ఈ వ్యాధితో మరణించిన తొలి విదేశీయురాలు ఆమెనే. 2015లో ఇప్పటివరకూ రాజస్తాన్ లో వ్యాధిబారిన పది 112 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. మరో 1000 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.