: దగ్గు, జ్వరంతో బాధపడుతున్న కేజ్రీవాల్... ఇంటి నుంచే కార్యకలాపాలు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో, ఆయన నేడు ఇంటికే పరిమితమయ్యారు. పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు కేజ్రీవాల్ కు సూచించారు. ప్రస్తుతం ఆయన తన నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లను మట్టికరిపించిన 'ఆప్' సర్కారును ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఈ నెల 14న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.