: హైదరాబాద్ బ్రాండ్ అంబాసడర్ గా మహేశ్ బాబు?
తెలంగాణ రాష్ట్రానికి టెన్నిస్ క్వీన్ సానియా మీర్జాను ప్రచారకర్తగా నియమించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు హైదరాబాదు నగరంపై దృష్టి సారించారు. హైదరాబాదుకు టాలీవుడ్ టాప్ హీరో మహేశ్ బాబును బ్రాండ్ అంబాసడర్ గా నియమించాలని ఆయన భావిస్తున్నారట. ప్రస్తుతం మహేశ్ తో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆ హీరో అంగీకరిస్తే అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. హైదరాబాదును గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్న తెలంగాణ సర్కారు, ఆ స్థాయిలో ప్రచారం అవసరమన్న విషయం గుర్తించింది. అందుకు మహేశ్ బాబు అయితే సరిపోతాడని కేసీఆర్ భావించడంతో, సంబంధిత వర్గాలు రంగంలోకి దిగాయట.