: పేరుకుపోయిన కేసులు చూసుకోండి... పరిపాలనలో వేలు పెట్టొద్దు: సుప్రీంతో మోదీ సర్కారు


పరిపాలనా పరమైన వ్యవహారాల్లో కల్పించుకోవద్దని మోదీ సర్కారు సుప్రీంకోర్టుకు కాస్తంత గట్టిగానే సూచించింది. విధాన నిర్ణయాల్లో జోక్యం బదులు, పేరుకుపోయిన కేసుల పరిష్కారం కోసం మార్గాలు వెతకాలని తెలిపింది. కాగ్ బాధ్యతలను రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మకు అప్పగించడంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరుగుతున్న సందర్భంగా అటార్నీ జనరల్ ముకుల్ రొహత్గి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదన వినిపిస్తూ, కాగ్ అధిపతిగా తన హయాంలో రక్షణ రంగంలో జరిగిన కొనుగోళ్ళపై విచారణను ఆయనే ఎలా పర్యవేక్షిస్తారని ప్రశ్నించారు. ఈ వాదనను కేంద్రం మాత్రం కొట్టివేసింది.

  • Loading...

More Telugu News