: ఆర్టీసీకి అత్యంత విలాసవంతమైన స్కానియా బస్సులు!
ప్రపంచంలో విలాసవంతమైన బస్సుల తయారీకి పేరెన్నికగన్న 'స్కానియా'తో ఆర్టీసీ ఒప్పందం చేసుకోనున్నట్టు తెలిసింది. ఈ బస్సులను తొలుత ప్రయోగాత్మకంగా పరిశీలించాలని భావిస్తున్న అధికారులు, ముందుగా రెండు బస్సులను నేడు హైదరాబాదుకు తీసుకురానున్నారు. వీటిని హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - విజయవాడ మధ్య తిప్పనున్నారు. దూరప్రాంతాల మధ్య ప్రస్తుతం తిరుగుతున్న గరుడ ప్లస్ కేటగిరీలో భాగంగా వీటిని ఉపయోగించనున్నారు. కాగా, ఈ బస్సు ధర రూ.1.10 కోట్లుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మరింత మెరుగైన కుషన్, వేగంగా సుఖవంతమైన ప్రయాణం ఈ బస్సు ప్రత్యేకతలు. రెండు నెలల పాటు ఉచితంగా తిప్పేందుకు రెండు బస్సులను 'స్కానియా' అందిస్తోంది.