: అధికారమివ్వండి... ఇస్లామిక్ స్టేట్ పై యుద్ధం చేద్దాం... ఒబామా వినతి
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)పై సైనిక చర్యకు అధికారం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చట్టసభను కోరారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల హింసాత్మక చర్యలకు తక్షణం అడ్డుకట్ట వేసి, వారి దురాక్రమణను అరికట్టకపోతే, భవిష్యత్తులో అమెరికాకు ప్రమాదం కలగవచ్చునని ఆయన అన్నారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవాలని తీసుకున్న సంకల్పంలో మనం కలిసికట్టుగా ఉన్నామని ప్రపంచానికి చూపించాలని చట్టసభ సభ్యులకు విన్నవించారు. కాగా, రష్యా మద్దతుగల వేర్పాటువాదులతో పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికులకు మార్చిలో శిక్షణ ఆరంభించాలని భావిస్తున్నట్టు యూరప్‌లోని అమెరికా సైనికాధికారొకరు తెలిపారు.