: కౌన్సిలింగ్ కు పిలిస్తే, పోలీసుల పైనే దాడి!
రెండు కుటుంబాలను కౌన్సిలింగ్ కు పిలిస్తే, వారిలో వారు ఘర్షణకు దిగి, చివరకు పోలీసుల పైనే దాడి చేసిన ఘటన హైదరాబాద్ సీసీఎస్ లో జరిగింది. ఓ కేసును సామరస్యంగా పరిష్కరించే నిమిత్తం రెండు కుటుంబాల వ్యక్తులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సమయంలో ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. గొడవ పెద్దది కావడంతో, వారిని ఆపేందుకు పోలీసులు యత్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన వారు పోలీసులపై దాడికి దిగారు. పోలీసులపై దాడి చేసిన వారి మీద సైఫాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది.