: ఆంధ్రా ఉద్యోగులకు బాబు కొత్త హుకుం... సెలవుల్లోనూ పనిచేయాలట!


ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగులు వచ్చే నాలుగున్నరేళ్ళూ సెలవు రోజుల్లో కూడా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'స్వచ్ఛ ఆంధ్ర' పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నా కూడా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించామని గుర్తుచేస్తూ, అందువల్ల ఉద్యోగులు సెలవుల్లో కూడా పనిచేసి అభివృద్ధికి సహకరించాలని అన్నారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, టౌన్‌షిప్, పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News