: విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు 4.75 లక్షల డాలర్ల చొప్పున పరిహారం


ఫిబ్రవరి 3న తైవాన్ లోని బ్రిడ్జ్ ను ఢీ కొట్టి తైపీ నదిలో కూలిపోయిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు 4.75 లక్షల డాలర్ల నష్టపరిహారం చెల్లించనున్నట్టు ట్రాన్స్ ఏషియా విమాన సంస్థ ప్రకటించింది. 55 మంది ప్రయాణికులతో నింగికెగసిన ట్రాన్స్ ఏషియా విమానం సాంకేతిక లోపంతో కూలిపోతుండగా, ఆవాస స్థలాలకు దూరంగా, పైలట్ దానిని నదిలో కూలేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందజేయనున్నట్టు ట్రాన్స్ ఏషియా వెల్లడించింది.

  • Loading...

More Telugu News