: ఇద్దరు ఎయిరిండియా విమాన సిబ్బంది అరెస్టు
ఎయిరిండియాకు చెందిన ఇద్దరు విమాన సిబ్బందిని ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. దేశీయ విమానంలో 3 కేజీల బంగారం తీసుకెళ్తుండడంతో అధికారులు వారిని పట్టుకున్నారు. సుమారు 78 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని వారి వద్దనుంచి స్వాధీనం చేసుకున్నారు. వారిపై స్మగ్లింగ్ ఇతర సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.