: నెక్లెస్ రోడ్డులో ఆయన స్మారక చిహ్నం నిర్మించండి: కేసీఆర్ ఆదేశం
మాజీ కేంద్ర మంత్రి దివంగత జి.వెంకటస్వామి స్మారకం హైదరాబాదు, నెక్లెస్ రోడ్డులో నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. విగ్రహ ప్రాంతం సభల నిర్వహణకు అనువుగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ స్మారకం నిర్మాణ బాధ్యతలను హైదరాబాదు మెట్రో డెవలెప్ మెంట్ అథారిటీకి అప్పగించారు. ఈ స్మారకం నిర్మాణాన్ని వెంకటస్వామి జయంతి నాటికి పూర్తి చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. కాగా, వెంకటస్వామికి స్మారకం నిర్మాణంపై ఆయన కుమారుడు, మాజీ ఎంపీ వివేక్ కొద్దిసేపటి క్రితమే సీఎంను కలిసిన విషయం విదితమే.