: హీరోలుగా మారాలన్నా, జీరోలుగా మారాలన్నా అంతా మీ చేతుల్లోనే: ఐసీసీ మ్యాచ్ రిఫరీ


డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాకు అద్భుతమైన బ్యాటింగ్ లైైనప్ ఉందని మాజీ బౌలర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ తెలిపారు. టీమిండియా కప్పు గెలవాలంటే బౌలర్లు మెరుగుపడాల్సి ఉందని అన్నాడు. ధోనీ, రైనా, కోహ్లీ, రోహిత్, ధావన్ వంటి వారితో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉందని తెలిపాడు. కానీ, కప్ కావాలంటే మాత్రం బౌలింగ్ లో విశేషమైన మార్పు రావాలని సూచించాడు. ఆడే ప్రతి మ్యాచ్ ఫైనల్ అని భావించాల్సిందేనని శ్రీనాథ్ స్పష్టం చేశాడు. ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా ప్రత్యర్థి మ్యాచ్ ను లాగేసుకోవడం ఖాయమని తెలిపాడు. హీరోలుగా నిలవాలంటే అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాల్సిందేనని, జీరోలుగా మారకుండా చూసుకోవాలని సూచించాడు.

  • Loading...

More Telugu News