: ఐపీఎల్-8 షెడ్యూల్ విడుదల
ఐపీఎల్-8వ సీజన్ కు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. తాజా సీజన్ ఏప్రిల్ 8న ప్రారంభం కానుంది. ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంప్ కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు వేదిక. మే 24న జరిగే ఫైనల్ తో ఈవెంట్ ముగుస్తుంది. గత సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.