: కలెక్టర్ నుంచి అభినందనలు అందుకున్న ఎస్సీ హాస్టల్ విద్యార్థులు
వినూత్నంగా ఆలోచించే మంచి ఆలోచనకు గుర్తింపు తప్పక లభిస్తుందన్న ఘటన మెదక్ జిల్లాలోని సంగారెడ్డి ఎస్సీ హాస్టల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా హాస్టల్ నిద్ర కోసం సంగారెడ్డిలోని ఎస్సీ బాలుర వసతి గృహానికి వచ్చారు. ఈ సందర్భంగా హాస్టల్ లో విద్యనభ్యసిస్తున్న వర్ధన్, వంశీ లు హాస్టల్ లో దొరికిన అట్టలతో ఓ కారును తయారు చేసి, అందంగా పెయింట్ చేసి కలెక్టర్ కి అందజేశారు. మరో విద్యార్థి సురేష్ కుక్కపిల్ల బొమ్మ ఉన్న కార్ కీస్ హోల్డర్ ను అందజేశాడు. విద్యార్థుల ప్రతిభను అభినందించిన కలెక్టర్ అవి తన వద్దే ఉంచుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా చదువు పట్ల ఆసక్తి ఎలా పెంచుకోవాలో, ఎలా చదివితే విషయం గ్రహించవచ్చో ఆయన విద్యార్థులకు వివరించారు. వసతులపై కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో మాటల్లో పడిన కలెక్టర్ 11.45 నిమిషాలకు నిద్రకు ఉపక్రమించారు.