: మసకద్జా ఖలేజా... శ్రీలంకకు జింబాబ్వే షాక్
వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో శ్రీలంకకు షాక్ తగిలింది. జింబాబ్వే జట్టు 7 వికెట్ల తేడాతో లంకేయులను చిత్తు చేసింది. లింకన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 279 పరుగులు చేసింది. లంక బ్యాట్స్ మెన్ లలో కరుణరత్నే (58), జీవన్ మెండిస్ (51) రాణించారు. అనంతరం, వన్ డౌన్ బ్యాట్స్ మన్ హామిల్టన్ మసకద్జా (117 నాటౌట్) అజేయ సెంచరీతో జింబాబ్వేకు విజయం కట్టబెట్టాడు. మసకద్జా వీరోచిత ఇన్నింగ్స్ సాయంతో జింబాబ్వే మరో 28 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మసకద్జాకు తోడు టేలర్ (63), విలియమ్స్ (51 నాటౌట్) కూడా రాణించడంతో జింబాబ్వే 45.2 ఓవర్లలో 3 వికెట్లకు 281 పరుగులు చేసింది.