: గాంధీని జాతిపిత అనడాన్ని తప్పుపట్టిన వీహెచ్ పీ నేత
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత గొప్ప వ్యక్తిగా మన్ననలందుకుంటూ, ప్రపంచ నేతలకు తాను నమ్మిన సిద్ధాంతాలతో మార్గ నిర్దేశం చేస్తున్న మహాత్మాగాంధీని వీహెచ్ పీ టార్గెట్ చేసినట్టు కనపడుతోంది. ఈ మధ్య కాలంలో పలు వివాదాలతో ప్రచారంలోకి వచ్చిన వీహెచ్ పీ నాయకురాలు సాధ్వి ప్రాచి ఏకంగా గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు. గాంధీని జాతిపితగా అభివర్ణించడాన్ని ఆమె తప్పుబట్టారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ పాత్రకన్నా, ఇతరుల పాత్రే ఎక్కువని అన్నారు. భగత్ సింగ్ లేదా వీర సావర్కర్ లకు జాతిపిత గుర్తింపు ఇవ్వాలని ఓ సమావేశంలో ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపుతాయో వేచి చూడాలి.