: ఎస్ఆర్ నగర్ లో మాయలేడీ... జాయింట్ కలెక్టర్నంటూ హైదరాబాదీలకు బురిడీ
హైదరాబాదీలకు మరో మాయలేడీ కుచ్చుటోపీ పెట్టింది. తనను తాను జాయింట్ కలెక్టర్ గా చెప్పుకుంటూ భారీ మోసానికి పాల్పడింది. ప్రభుత్వంలో కీలక అధికారినని ప్రచారం చేసుకున్న శైలజ అనే మహిళ రాజీవ్ స్వగృహ పథకంలో ఇళ్ల కేటాయింపుతో పాటు గృహనిర్మాణ శాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ ప్రచారం చేసుకుంది. ఈ క్రమంలో పలువురి నుంచి భారీగా డబ్బు దండుకుంది. ఈ నేపథ్యంలో శైలజపై అనుమానం వచ్చిన కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొద్దిసేపటి క్రితం శైలజను ఎస్ఆర్ నగర్ లో అరెస్ట్ చేశారు.