: వరల్డ్ కప్ ల్యాప్ టాప్ లు ఎత్తుకెళ్లారు!


వరల్డ్ కప్ పోటీలు ఈ నెల 14 నుంచి జరగనుండగా, టోర్నీ సమాచారంతో కూడిన 5 ల్యాప్ టాప్ లు చోరీకి గురైనట్టు గుర్తించారు. న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో ఉన్న హాగ్లే నెట్ బాల్ సెంటర్ కు చెందిన అక్రిడిటేషన్ సెంటర్ నుంచి వీటిని తస్కరించారు. దొంగతనం జరిగిన విషయాన్ని కాంటర్బరీ జిల్లా కమాండర్ సూపరింటెండెంట్ గ్యారీ నోల్స్ నిర్ధారించారు. అయితే, వరల్డ్ కప్ భద్రతా ఏర్పాట్లపై ఈ ఘటన ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. అయినా, ఆ ల్యాప్ టాప్ లకు పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉందని, ప్రమాదమేమీ లేదని నోల్స్ తెలిపారు. కాగా, ఆ ల్యాప్ టాప్ లలో ఉన్న సమాచారం ఏమంత కీలకమైనది కాదని ఐసీసీ పేర్కొంది.

  • Loading...

More Telugu News