: ఏపీకి రూ.100 కోట్ల సాయం చేయండి... కేంద్ర మంత్రిని కోరిన మంత్రి కామినేని


ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఢిల్లీలో ఈరోజు కేంద్ర మంత్రి జేపీ నద్దాను కలిశారు. దాదాపు అర్ధగంటకు పైగా ఆయనతో భేటీ అయి, రాష్ట్ర సమస్యలపై వివరించారు. రాష్ట్రానికి రూ.100 కోట్ల సాయం చేయాలని కోరారు. మంత్రితో సమావేశం ముగిసిన అనంతరం కామినేని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు 50 చొప్పున అదనంగా మెడికల్ సీట్లు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఎయిమ్స్ శంకుస్థాపనకు వస్తానని మంత్రి నద్దా చెప్పారని తెలిపారు.

  • Loading...

More Telugu News