: రాష్ట్రంలో అకాల వర్షాలు
భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలను సేద దీర్చేందుకా అన్నట్టు రాష్ట్రంలో కొన్ని చోట్ల నేడు వర్షాలు పడ్డాయి. విశాఖ, తిరుపతి, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఉరుములు, జల్లులతో కూడిన వర్షంతో పాటు వడగళ్ళు కూడా పడ్డాయి. పలాస మండలం నున్నాడలో పిడుగుపాటు ఇద్దరిని బలి తీసుకుంది. కాగా, అల్పపీడన ద్రోణి కారణంగా మరో 24 గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది.