: ఏపీకీ విద్యుత్ కష్టాలు మొదలు... తెలంగాణ సాయం కోరిన చంద్రబాబు సర్కారు


నిన్నటిదాకా వేళాపాళాలేని విద్యుత్ కోతలతో తెలంగాణ ప్రజలు సతమతం కాగా, విద్యుత్ ఇక్కట్లను తీర్చే దారి కనిపించక కేసీఆర్ సర్కారు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. తాజాగా అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లోనూ తలెత్తింది. అయినా సదరన్ గ్రిడ్ ఏర్పాటుతో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా అవుతోంటే, ఇక సమస్యేమిటంటారా? అసలు విషయమేమిటంటే, నాగార్జునసాగర్ లో నీటి నిల్వలు అడుగంటాయి. దీంతో సాగర్ పవర్ హౌస్ లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. సాగర్ పవర్ హౌస్ లో విద్యుదుత్పత్తి నిలిచిపోతే ఏపీలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో వెనువెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు సర్కారు, తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించింది. సాగర్ లో విద్యుదుత్పత్తిని పునరుద్ధరించేందుకు అవసరమైన 10 వేల క్యూసెక్కుల నీటిని సాగర్ కుడి కాల్వ ద్వారా విడుదల చేయాలని కోరింది. అయితే చంద్రబాబు సర్కారు ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News