: ఢిల్లీ ప్రజలకు రేడియోలో 'థాంక్స్' చెప్పిన కేజ్రీ... ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లకు చుక్కలు చూపిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో, ఈ నెల 14న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన గెలుపునకు తోడ్పడిన ఢిల్లీ ప్రజలకు ఆయన రేడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. రామ్ లీలా మైదానంలో జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. "మీ హక్కును మీకివ్వడం నా విధి. రామ్ లీలా మైదానానికి తప్పక రండి. ఢిల్లీని మెరుగైన ప్రదేశంగా తీర్చిదిద్దుదామని ప్రమాణం చేద్దాం. సామాన్యుడి ముఖంలో సంతోషం తీసుకువచ్చేందుకు ప్రమాణం చేద్దాం. నేను మీ గొంతుకను మాత్రమే. జై హింద్" అంటూ తన రేడియో ప్రకటనలో కేజ్రీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News