: ఆమ్ ఆద్మీకి ఆదాయపన్ను శాఖ నోటీసు


ఢిల్లీలో అధికారం చేపట్టబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదాయపన్ను శాఖ నోటీసు జారీ చేసింది. పార్టీకి వచ్చిన రూ.2 కోట్ల విరాళాల గురించిన వివరాలు తెలపాలని అందులో కోరింది. ఇందుకు ఆప్ ఈ నెల 16లోగా ఆ శాఖకు సమాధానం ఇవ్వనుంది. ఎన్నికలకు ముందుకు ఆమ్ ఆద్మీకి వచ్చిన విరాళాలపై పలు విమర్శలు వచ్చాయి. అవన్నీ నల్లధనమేనని ఆప్ వాలంటరీ యాక్షన్ మంచ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అటు ఢిల్లీ హైకోర్టులోనూ ఆప్ విరాళాలపై వ్యాజ్యం దాఖలైంది. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సొంతం చేసుకున్న ఆప్ కు రెండోరోజే నోటీసు పంపడం గమనార్హం.

  • Loading...

More Telugu News