: కృష్ణాజిల్లాలో కస్టోడియల్ డెత్... పెనమలూరు పోలీసుల అదుపులోని నిందితుడు ఆత్మహత్య
కృష్ణా జిల్లాలో గత రాత్రి కస్టోడియల్ డెత్ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న క్రమంలో చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఓ యువకుడు పోలీసుల సమక్షంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో చోరీ కేసు నిందితుడు రమేశ్ (23) చనిపోయాడు. పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగానే పురుగుల మందు తాగిన రమేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించేలోగానే చనిపోయాడు. చోరీ కేసులో విచారణ పేరిట నిత్యం పోలీస్ స్టేషన్ కు పిలుస్తున్న పోలీసులు రమేశ్ ను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, ఆ కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.