: ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్న కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల 14న సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానించే పనిలో కేజ్రీవాల్ నిమగ్నమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కేజ్రీవాల్, తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్నారు. మోదీకి ఆహ్వానం అందించేందుకు తానే నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ ఆయన దరఖాస్తు చేసుకున్నారు. మరి కేజ్రీవాల్ ఆహ్వానానికి మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి.