: మార్చి 7 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు... రూ. లక్ష కోట్లతో తొలి పూర్తి స్థాయి బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 7 నుంచి మొదలుకానున్నాయి. సమావేశాల్లో భాగంగా వచ్చే నెల 12న ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 16 రోజుల పాటు కొనసాగనున్న బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజున గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతున్న బడ్జెట్ రూపకల్పన కసరత్తును ఈ నెల 19 లోగా ముగించనున్నట్టు యనమల తెలిపారు.