: ఇసుక దందాపై సమాచారమిస్తే... రివార్డులిస్తాం: వికారాబాద్ సబ్ కలెక్టర్ వర్షిణి కొత్త యోచన


ఇసుక అక్రమ రవాణా తెలుగు రాష్ట్రాల్లో యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ దందాను నిలువరించేందుకు రెండు ప్రభుత్వాలూ ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా, ప్రయోజనం కనిపించడం లేదు. మరేం చేయాలి? ఇదే ఆలోచన చేసిన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సబ్ కలెక్టర్ అలగు వర్షిణి మదిలో కొత్త ఐడియా తట్టింది. ప్రజల భాగస్వామ్యంతో సాధించలేనిదేమీ లేదన్న రీతిలో ఆమె రంగంలోకి దిగారు. ‘‘ఇసుకాసురులపై ఫోటోలు సహా వాట్సప్ లో పక్కా సమాచారం ఇవ్వండి, నగదు బహుమతులు అందుకోండి’’ అంటూ ఆమె జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. వర్షిణి ఇచ్చిన పిలుపునకు స్వల్ప వ్యవధిలోనే స్పందన వచ్చింది. అక్రమంగా దాచేసిన 15 ట్రాక్టర్ల ఇసుకకు సంబంధించి ఓ ఇంటర్ విద్యార్థి ఇచ్చిన సమాచారంతో దాడులు చేసిన ఆమె సదరు ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందించిన విద్యార్థికి రూ.5 వేల నగదు బహుమతి కూడా అందజేశారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని చెబుతున్న ఆమె వాట్సప్ సౌకర్యం లేని వారు మాత్రం పక్కా సమాచారం ఇవ్వాల్సిందేనని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News