: ఢిల్లీ ఫలితాలతోనైనా కల్వకుంట్ల కవితకు జ్ఞానోదయం కలగాలి: జీవన్ రెడ్డి
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, నిజామామాద్ ఎంపీ కవితపై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని, విపక్ష నేతలను ఉద్దేశించి కవిత చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని... ప్రజా ప్రతినిధిగా ఉన్న ఆమె సరైన భాషను ఉపయోగించడం నేర్చుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడటం సరైందికాదని... అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని కవిత గుర్తుంచుకోవాలని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలే దీనికి నిదర్శనమని చెప్పారు. తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ సొంతం కాదని. ఎంతో మంది ఉద్యమంలో పాలుపంచుకున్నారని జీవన్ రెడ్డి అన్నారు. ఉద్యమంలో భాగంగా తాను కూడా రెండు రోజుల పాటు జైలుకు వెళ్లానని చెప్పారు.