: ఇప్పటి వరకు ఢిల్లీని పరిపాలించిన వారు...వీరే


1,484 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఢిల్లీని ఏడుగురు ముఖ్యమంత్రులు పరిపాలించారు. 1952 నుంచి ఢిల్లీకి ముఖ్యమంత్రులు పరిపాలన అందించడం మొదలు పెట్టారు. 1956లో ఓ సారి, 2014లో ఓ సారి రాష్ట్రపతి పాలన విధించారు. కాగా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఢిల్లీని రాజధాని నగరంగానే పాలకులు పరిగణించారు. రాజధాని విస్తీర్ణం పెరగడం, పలు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం రాజధానికి వలసలు పెరగడంతో దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచారు. రాష్ట్రం హోదా ఇచ్చిన అనంతరం 8 మంది ముఖ్యమంత్రులు పరిపాలన సాగించారు. 1952లో ఛౌధురీ బ్రహ్మ ప్రకాశ్ తొలి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. తరువాత 1955లో గురుముఖ్ నీహాల్ సింగ్ సీఎం అయ్యారు. అనంతరం 1993లో మదన్ లాల్ ఖురానా ముఖ్యమంత్రిగా నిలిచారు. 1996లో సాహెబ్ సింగ్ వర్మ ఎన్నిక కాగా, 1998లో సుష్మస్వరాజ్ సీఎంగా నిలిచారు. 1998 నుంచి 2013 వరకు షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు నేరవేర్చారు. అనంతరం ఎన్నికైన కేజ్రీవాల్ కేవలం 49 రోజులు పరిపాలించి రాజీనామా చేశారు. ఇప్పుడు మరోసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కానుండడం లాంఛనమే.

  • Loading...

More Telugu News