: పాక్ కంటే టీమిండియా మెరుగ్గా ఉంది: ఇర్ఫాన్ పఠాన్


ఐసీసీ ప్రపంచకప్ లో పాల్గొనే పాకిస్థాన్ జట్టు కంటే భారత క్రికెట్ జట్టు బాగుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ నేపథ్యంలో తొలి మ్యాచ్ లో భారత జట్టు పాకిస్థాన్ తో తలపడనుంది. దీంతో రెండు దేశాల్లోని క్రీడాభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రపంచ క్రికెట్ లో భారత్, పాక్ పోరంటే ఉండే ఆసక్తే వేరు. దీంతో ఇరు దేశాల ఆటగాళ్లపై కూడా తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ వరల్డ్ కప్ లో టీమిండియాకు తిరుగులేదని అన్నాడు. ఈ మ్యాచ్ లో భారతజట్టు బాగా ఆడుతుందని, ఎప్పట్లానే టీమిండియా గెలుస్తుందని తెలిపాడు. కాగా, అడిలైడ్ లో ఫిబ్రవరి 15న టీమిండియా, పాక్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్లు అమ్ముడైపోగా, బ్లాక్ లో అభిమానులు టికెట్లు అమ్ముతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ మ్యాచ్ ను ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మంది చూస్తారని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News