: ఢిల్లీ ఎన్నికల్లో లాల్ బహదూర్ శాస్త్రి మనవడు గెలుపు
ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మనవడు అదర్శ్ శాస్త్రి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఢిల్లీలో ద్వారక నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన బీజేపీ అభ్యర్థి ప్రద్యుమ్న రాజ్ పుత్ పై 39,366 ఓట్లతో గెలిచినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఆదర్శ్ కు మొత్తం 79,729 ఓట్లు దక్కాయి.