: 18 స్థానాల్లో ఆప్ గెలుపు... 47 స్థానాల్లో ఆధిక్యం
ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇప్పటి వరకు 18మంది అభ్యర్థులు గెలుపొందగా, వారంతా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలే కావడం విశేషం. ఒంటి చేత్తో కాంగ్రెస్, బీజేపీలను ఆ పార్టీ మట్టికరిపించింది. మొత్తం 70 స్థానాలకు గానూ ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం ఆప్ 18 స్థానాల్లో విజయం సాధించి మరో 47 చోట్ల ముందంజలో ఉంది. బీజేపీ ఒక స్థానంలో గెలవగా 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఒక చోట విజయం సాధించి మరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.