: కేజ్రీవాల్ కే పూర్తి మార్కులు: కిరణ్ బేడీ
దేశ రాజధాని ఢిల్లీలో అధికారాన్ని చేపట్టబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయంలో పూర్తి మార్కులు ఆయనవేనని అన్నారు. "అరవింద్ కే ఫుల్ మార్క్. అభినందనలు. ఇక ఢిల్లీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లండి. ప్రపంచస్థాయి నగరంగా రూపొందించండి" అని బేడీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే కృష్ణానగర్ లో పోటీ చేసిన బేడీ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.