: ఢిల్లీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు: వెంకయ్యనాయుడు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే బీజేపీ తన ఓటమిని అంగీకరించింది. ఢిల్లీ ప్రజల తీర్పును గౌరవిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన ఢిల్లీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతిస్తామని తెలిపారు. ఈ ఫలితాలు కేంద్రం ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయం కాదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని ఆయన ప్రకటించారు.