: కేజ్రీవాల్ కు ప్రధాని మోదీ ఫోన్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం ముందు బీజేపీ వెలవెలబోతుండగా, ప్రధాని నరేంద్ర మోదీ కాస్త ముందుగానే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. త్వరలోనే కలుస్తానని కేజ్రీతో చెప్పారు. కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆప్ 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంతో నెట్టుకొస్తోంది. ఇక, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News