: ఫేస్ బుక్ లో ‘అల్లోల కల్లోలం’ కలకలం... పోస్టింగ్ తొలగింపునకు పోలీసుల విఫలయత్నం
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై ఆంధ్రజ్యోతి పత్రిక 'అల్లోల కల్లోలం' పేరిట రాసిన కథనం నిన్న ఫేస్ బుక్ లో అప్ లోడ్ అయ్యింది. మంత్రిగారి అవినీతి భాగోతంపై సదరు పత్రిక ప్రచురించిన కథనాన్ని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కు చెందిన ఓ యువకుడు ఫేస్ బుక్ లో పెట్టేశాడు. విషయం తెలుసుకున్న మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సదరు ఫేస్ బుక్ పోస్టింగ్ ను తొలగించాలని తన అనుచరులకు పురమాయించారు. అయితే పోస్టింగ్ ను తొలగించేందుకు ఆ యువకుడు ససేమిరా అనడంతో మంత్రి అనుచరులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల వార్నింగ్ నూ ఆ యువకుడు బేఖాతరు చేశాడు. దీంతో యువకుడి కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ కు పిలిచిన నిర్మల్ సీఐ, యువకుడిని బెదిరించేందుకు యత్నించారు. అయినా తొణకని యువకుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.