: ఢిల్లీ పీఠమెవరిదో తేలేది నేడే... మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం


ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు మధ్యాహ్నంలోగా విజేతలెవరన్న అంశాన్ని తేల్చేయనుంది. ఓట్ల లెక్కింపుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసింది. ఈ నెల 7న జరిగిన ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 67.14 శాతం మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. భారీ పోలింగ్ శాతం నమోదు కావడంతో అటు ఆప్ తో పాటు ఇటు బీజేపీలోనూ విజయం పట్ల ధీమా వ్యక్తమవుతోంది. మరోవైపు ఢిల్లీ సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారన్న అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News