: ఐదో అంతస్తు నుంచి జారిపడింది... అయినా బతికింది!


కృష్ణా జిల్లా విజయవాడలోని మాచవరం ప్రాంతంలో అరుణ అపార్టుమెంట్ ఐదో అంతస్తు నుంచి విజయలక్ష్మి అనే మహిళ ప్రమాదవశాత్తు జారిపడింది. అయితే అదృష్టవశాత్తు మూడో అంతస్తు గ్రిల్స్‌లో కాలు ఇరుక్కుపోయింది. దీనిని గమనించిన స్థానికులు 108, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో స్పందించిన 108, అగ్నిమాపక సిబ్బంది వచ్చి బాధితురాలిని రక్షించారు. కాగా, ఈ ఘటనలో ఆమె స్వల్పగాయాలతో బయటపడడం విశేషం.

  • Loading...

More Telugu News