: మాంఝీ వినతిని తోసిపుచ్చిన బీహార్ గవర్నర్
బీహార్ మంత్రి వర్గాన్ని విస్తరిస్తానన్న బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ వినతిని ఆ రాష్ట్ర గవర్నర్ తిరస్కరించారు. ఈ రోజు గవర్నర్ ను కలిసిన సందర్భంగా సీఎం మంత్రి వర్గ విస్తరణ చేపడతానని అనుమతి కోరారు. గవర్నర్ ఆయన వినతిని తోసిపుచ్చారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటూ గవర్నర్ ను కలిసిన సంగతి తెలిసిందే. కాగా, అసెంబ్లీలో తన బలం నిరూపించుకుంటానని మాంఝీ గవర్నర్ కు వినతి చేసిన సంగతి తెలిసిందే.