: బాల్యవివాహాన్ని అడ్డుకోబోయిన అధికారిపై దాడి


బాల్యవివాహం అడ్డుకోబోయిన అధికారిపై బాలిక తల్లిదండ్రులు దాడికి దిగిన సంఘటన హైదరాబాదు, సైదాబాద్ లో చోటుచేసుకుంది. సైదాబాద్ లోని సింగరేణి కాలనీలోని వాంబే గృహాల్లో వెనుక ఉన్న పోచమ్మ దేవాలయం సమీపంలో నివసించే ఓ వ్యక్తి తన కుమార్తె (19)కు పెళ్లి చేస్తున్నట్టు చైల్డ్ ప్రొటెక్షన్ రీజనల్ డైరెక్టర్ కు రహస్య సమాచారం అందింది. దీంతో హైదరాబాదు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఇంతియాస్, మహిళాశిశు సంక్షేమ సమగ్ర అభివృద్ధి పధకం ప్రాజెక్టు-1 మలక్ పేట సీపీడీవో ప్రజ్వాలకు బాల్యవివాహాన్ని ఆపాలని ఆదేశించారు. దీంతో బాలిక ఇంటికి వెళ్లిన అధికారులు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సాయంత్రం బాలికకు పెళ్లి చేస్తున్నారంటూ మళ్లీ సమాచారం రావడంతో అధికారులు మరోసారి వారింటికి వెళ్లారు. అప్పటికే బాలికకు వివాహం చేసిన కుటుంబ సభ్యులు అధికారులపై దాడికి దిగారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News