: విలన్ గా దర్శనమివ్వనున్న ప్రముఖ దర్శకుడు
బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ విలన్ గా దర్శనమివ్వనున్నాడు. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'బాంబే వెల్వెట్'లో కరణ్ విలన్ పాత్ర పోషించాడు. బాంబే వెల్వెట్ లో విలన్ కైజాద్ ఖంబట్టాగా కొత్త గెటప్ లో కనిపిస్తానని కరణ్ జోహర్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. మీసాలతో వున్న తన వినూత్నమైన లుక్ ను కూడా విడుదల చేశాడు. గత నెలలో బాంబే వెల్వెట్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ లో రణబీర్ కపూర్ కొత్త లుక్ లో పాతతరం నటుడిలా అభిమానులను అలరించాడు.