: 2,542 మందికి స్వైన్ ఫ్లూ పరీక్షలు... 831 మందికి పాజిటివ్... 42 మంది మృతి!
స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన 2542 మందికి పరీక్షలు నిర్వహించామని, వారిలో 831 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలియజేసింది. స్వైన్ ఫ్లూతో ఇప్పటి వరకు తెలంగాణలో 42 మంది మృతి చెందారన్నారు. నిన్న 99 మందికి స్వైన్ ఫ్లూ పరీక్షలు నిర్వహించగా, వారిలో 33 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. కాగా, స్వైన్ ఫ్లూ ప్రభావం రాష్ట్రంలో క్రమంగా తగ్గుతోందని వారు తెలిపారు. ప్రజలంతా శుభ్రత పాటించి నివారణ చర్యలు కొనసాగించాలని ఆయన కోరారు. స్వైన్ ఫ్లూ సోకినట్టు ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ ను సంప్రదించాలని వారు సూచించారు.