: అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం: మాంఝీ


బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ గవర్నర్ ను కలిశారు. శాసనసభాపక్ష నేతగా నితీశ్ కుమార్ ఎన్నిక రాజ్యాంగ విరుద్ధమని మాంఝీ పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికగా బలపరీక్షకు తాను సిద్ధమని ఆయన గవర్నర్ కు తెలిపారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పారని ఆయన తెలిపారు. కాగా, తనకు బలపరీక్షకు సరిపడా మద్దతుదారులున్నారని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గవర్నర్ ను కలిసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News