: రాజస్థాన్ అజ్మీర్ దర్గాలో తెలంగాణ భవన్ కడతారట!
ఢిల్లీలో ఏపీ భవన్ తరహాలో రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాలో తెలంగాణ భవన్ నిర్మించాలని టీఆర్ఎస్ సర్కారు భావిస్తోంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ రాజస్థాన్ సీఎం వసుంధరా రాజెను కలిశారు. సుప్రసిద్ధ అజ్మీర్ దర్గాలో తెలంగాణ భవన్ నిర్మిస్తామని, అందుకోసం ఎకరా భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి వసుంధర సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. దర్గా సమీపంలోని భూముల్లో అనుకూలమైన స్థలాన్ని గుర్తించి కేటాయిస్తామని ఆమె అలీకి హామీ ఇచ్చినట్టు సమాచారం. ముస్లింల పుణ్యక్షేత్రంగా అజ్మీర్ దర్గా ఎంతో ఖ్యాతిగాంచింది. విదేశాల నుంచి కూడా యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు.