: పొన్నాలపై దాడిని బీసీలపై దాడిగా భావిస్తున్నాం: టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య


'ఛలో రాజ్ భవన్' పాదయాత్ర సందర్భంగా గాయపడి ఆసుపత్రిపాలైన తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నిమ్స్ లో పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పొన్నాలపై దాడిని బీసీలపై జరిగిన దాడిగా భావిస్తున్నామని ఈ బీసీ సంఘం నేత పేర్కొన్నారు. ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదని అన్నారు. పొన్నాల స్థానంలో దొరలు ఉంటే ఇలాగే ప్రవర్తించేవారా? అని ప్రశ్నించారు. దొరలను రాష్ట్రం నుంచి తరిమికొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ కు హితవు పలికారు. కాగా, పొన్నాలను మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, శంకర్ రావు, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ తదితరులు పరామర్శించారు.

  • Loading...

More Telugu News