: వెంకయ్య ఇంట విందుకు హాజరైన కేసీఆర్, కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన విందుకు హాజరయ్యారు. కొన్ని రోజులుగా కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. తెలంగాణలో అభివృద్ధి పనులకు సహకరించాలని వారిని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన నేటి ఉదయం కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ ను కలిశారు. తెలంగాణలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు చేయూతనందివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం నాడు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 'నీతి ఆయోగ్' లోనూ కేసీఆర్ పాల్గొన్నారు.