: 2 లక్షలు దాటిన సిరియా మృతుల సంఖ్య
గడచిన నాలుగేళ్ళలో సిరియాలో జరిగిన అంతర్యుద్ధంలో 2.10 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. వీరిలో సామాన్య ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని మానవ హక్కుల సంఘం సిరియా విభాగం వెల్లడించింది. మృతుల సంఖ్య వాస్తవంలో ఇంకా అధికంగా ఉండొచ్చని అంచనా వేసింది. బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ఈ సంఘానికి సిరియా అంతటా నెట్ వర్క్ ఉంది. తన కార్యకర్తలు అందించిన సమాచారాన్ని మదింపు చేసిన ఈ కమిటీ మృతుల్లో 10,664 మంచి చిన్నారులు, 6,783 మంది మహిళలూ ఉన్నారని వెల్లడించింది. మొత్తం 35,827 మంది సిరియా రెబల్స్, 45,385 మంది సైన్యం లోని సిబ్బంది మరణించారని తెలిపింది. తాము అధికారికంగా ప్రకటించిన ఈ గణాంకాలలో మృతుల వివరాలకు సంబంధించి వారి గుర్తింపు కార్డులు, చిరునామాలు పరిశీలించామని హక్కుల కమిటీ చీఫ్ రమీ అబ్దుల్ రహ్మాన్ తెలిపారు.